రోజుకు ఒక్కసారైనా బ్లాక్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ టీ తాగటం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం లాంటి సమస్యలు దరి చేరవు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా బ్లాక్ టీ ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యకు సైతం చెక్ పెడుతుంది. కాకపోతే టీ లో చక్కెర స్థానంలో తేనె, బెల్లం మొదలైన సహజ తీపి పదార్థాలను జోడిస్తే మంచిది.