పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన యువతి ఉషారాణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన భువనేశ్వర్ అనే యువకుడే ఆ అమ్మాయిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉషారాణితో ప్రేమాయణం కొనసాగిస్తూనే వివాహిత అయిన మరో స్టాఫ్ నర్స్‌తో కూడా అతడు సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డుతొలగించాలనే కుట్ర పన్నాడు. నిద్రమాత్రలు కలిపిన పానీయం ఇచ్చి, అనంతరం మరో ఇద్దరి సహాయంతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని రాయికి కట్టి చెరువులో పడేశారు. కేసును ఛేదించిన పోలీసులు భువనేశ్వర్, స్టాఫ్ నర్స్ కృపారాణి, మరో సహాయకుడిని అరెస్ట్ చేశారు.