రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో పర్యటిస్తున్న ఆయన, 'హిందువులు లేకుండా ప్రపంచానికి ఉనికి ఉండదన్నారు. ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకం' అని అన్నారు. గ్రీస్, ఈజిప్ట్, రోమ్ వంటి నాగరికతలు నశించినా, భారతీయ నాగరికత మాత్రం నిలిచి ఉందని, మన సమాజం ఒక బలమైన వ్యవస్థను నిర్మించుకుందని అన్నారు. అందుకే హిందూ సమాజం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.