TG: జనగామ జిల్లా లింగాల ఘనపురంలో భర్తను భార్యలు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనకయ్య తాగిన మైకంలో అత్తపై దాడి చేసి హతమార్చాడనే కోపంతో ఇద్దరు భార్యలు కనకయ్య బెయిల్ పై రాగానే గొడ్డలితో నరికి చంపేశారు. దీనికి గ్రామస్తులు, అతడి సొంత అక్క, చెల్లెలు సైతం సహకరించినట్లు తేలింది. కనకయ్య తన మైనర్ చెల్లెల్లు, చిన్నమ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారే స్వయంగా వెల్లడించారు.