స్నానాల గదిలో రహస్యంగా కెమెరాలు అమర్చిన మహిళ అరెస్ట్

తమిళనాడు డెంకణీకోట సమీపంలోని నాగమంగలలో ఓ సెల్‌ఫోన్ కంపెనీ వసతిగృహంలో స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విచారణలో ఒడిశాకు చెందిన నీలకుమారి అనే మహిళ సీక్రెట్‌గా కెమెరాలు అమర్చి, వీడియోలను బెంగళూరులోని సంతోష్‌ అనే వ్యక్తికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేయడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్