గుజరాత్లోని వడోదరలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛానీ జకత్నాకా ప్రాంతంలో ఓ మహిళపై కొండముచ్చు దాడి చేసింది. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో నడుస్తూ వెళ్తున్న మహిళకు కొండముచ్చు ఎదురుపడింది. దానిని చూసి మహిళ ఆగిపోగా ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ క్రమంలో మహిళ కిందపడి, భయంతో కేకలు వేసినా వదలకుండా పలుమార్లు కరిచింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు అటవీ శాఖ స్పందించి కొండముచ్చును బోనులో బంధించి అటవీ ప్రాంతానికి తరలించింది.