కోర్టులోనే మహిళపై భర్త దాడి.. గొంతు నులిమి చంపేందుకు యత్నం!

కోర్టులోనే ఓ మహిళపై దాడి చేసిన ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్‌ లో జరిగింది. కుటుంబ న్యాయస్థానంలో సెప్టెంబర్ 24న విచారణ అనంతరం కోర్టు గది నుంచి బయటకు వచ్చిన మహిళ ప్రియా త్రిపాఠిపై ఆమె భర్త మనీష్‌ కుమార్‌ మిశ్రాతోపాటు ప్రిన్స్‌ మిశ్రా, సతీష్‌ మిశ్రా అనే ఇద్దరు దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. తనను కొట్టి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని, అడ్డుకోబోయిన తన తండ్రి, సోదరిపైనా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులకు అందించింది.

సంబంధిత పోస్ట్

✕
✕