మహారాష్ట్రలోని ఒక RSS శాఖలో వర్షం పడుతున్నా ప్రార్థనా కార్యక్రమం జరిపారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఓ పాము అక్కడకు ప్రవేశించింది. అయితే ఆశ్చర్యకరంగా, అక్కడ ఉన్న స్వయంసేవకులు ఎటువంటి భయాందోళనకూ లోనుకాకుండా తమ స్థానాల్లో కదలకుండా నిలబడి ప్రార్థన కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.