రూ.50 డిస్కౌంట్ ఇవ్వలేదని యువతిపై దాడి చేసిన మహిళ(VIDEO)

యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. రూ.50 డిస్కౌంట్ ఇవ్వలేదని యువతిపై దాడి చేసింది. లాండ్రీ నుంచి బెడ్‌షీట్లు తీసుకెళ్లేందుకు భర్తతో కలిసి వచ్చిన మహిళ బిల్లు చెల్లింపు విషయంలో రిసెప్షనిస్ట్‌తో వాగ్వాదానికి దిగింది. బిల్లు రూ.750 కాగా రూ.700 ఇస్తానని పట్టుబట్టింది. రూ.50 డిస్కౌంట్ ఇవ్వడం కుదరదనీ, ఓనర్ తిడతాడని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఆవేశానికి లోనైనా ఆ మహిళ యువతిని చెంపపై కొట్టింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్