పోలీసులు వేధిస్తున్నారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

TG: భద్రాచలం పట్టణంలో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ స్వాతి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ వివాదం నేపథ్యంలో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన తనను, కొందరు సిబ్బంది లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో అవమానించారని ఆమె ఆరోపించింది. ఆవేదనతో భద్రాచలం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడున్న వాహనదారులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను స్టేషన్‌కు తరలించారు. ఆమె ఆరోపణలపై ఎస్పీ విచారణ చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్