చిత్తూరు కలెక్టరేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం(వీడియో)

AP: ఏఎన్‌ఎం మెరిట్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ నాన్ లోకల్ అంటూ ఉద్యోగం ఇవ్వడంలేదని ఆవేదన చెందిన ఓ మహిళ చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్.ఆర్.పురం మండలం ఉప్పరపల్లికి చెందిన దివ్యాంగురాలైన మనెమ్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తనని భర్త వదిలేసినా.. రెక్కల కష్టంతో జీవనం సాగిస్తూ మెరిట్‌లో అర్హత సాధిస్తే జాబ్ లేదంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్