పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

TG: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పోలీస్ స్టేషన్లో ఇంజంవారి గూడెం గ్రామానికి చెందిన స్వప్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీంద్ర నాయక్ సివిల్ విషయాల్లో జోక్యం చేసుకొని వేధిస్తున్నాడని, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఎస్ఐ స్పందించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్