ఉరేసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు(వీడియో)

TG: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నిస్సాంపల్లి గ్రామంలో జ్యోతి అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు డయల్ 100కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. 7 నిమిషాల్లో బాధితురాలు ఇంటికి చేరుకొని తలుపు పగలగొట్టి జ్యోతిని కిందికి దించారు. వెంటనే సీపీఆర్ చేసి, మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మహిళ ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్