హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లా చింత్‌పూర్ణి పరిధిలోని బగ్రు గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒక మహిళను ఆమె భర్త, మరిది కలిసి రోడ్డుపైనే అందరూ చూస్తుండగా అత్యంత దారుణంగా కొట్టారు. ఈ అమానుష దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన స్థానిక మహిళల రక్షణ, భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.