TG: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లెలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బంగారం కోసం పిసా బుచ్చవ్వ (80) అనే వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని చంపి, 2 తులాల బంగారం, 50 తులాల వెండిని దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.