పట్టపగలే మహిళ దారుణ హత్య (వీడియో)

TG: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు నడివీధిలో కొరివి భిక్షవమ్మ (40) అనే మహిళ గొంతును కోసి పరారయ్యారు. కోడిని హలాల్ చేసినట్లుగా ఆమె మెడను సగం వరకు కోసేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు ఉపయోగించిన కత్తి రెండు ముక్కలై ఘటన స్థలంలోనే పడిపోయింది. ఈ హత్య ఎవరు, ఎందుకు చేశారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్