TG: హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక నైట్ ఐ హోటల్‌లో ఓ మహిళను చంపి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సదరు మహిళను చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతురాలు సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంకు చెందిన నరసమ్మగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.