AP: విశాఖపట్నం గాజువాకలో నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో మౌనిక (29) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని ఫ్లాట్‌కు తీసుకెళ్లగా, మృతురాలి బంధువులు రవీంద్రపై దాడి చేశారు. మౌనిక తండ్రి తన కూతురు అమాయకురాలని, రవీంద్ర ఆమెను ట్రాప్ చేశాడని ఆరోపించారు. డేటింగ్ యాప్‌లో పరిచయమై, బ్రేకప్ తర్వాత ఐడీ కార్డు విషయంలో వాగ్వాదం జరిగి, కోపంలో హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడని సమాచారం. అయితే, పోలీసులు దీనిని పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.