ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా, రూర్కీలో ఒక వివాహిత తన ప్రియుడితో హోటల్‌లో అభ్యంతరకరమైన స్థితిలో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. అనుమానంతో వెతుకులాటలో బస్ స్టేషన్ సమీపంలోని హోటల్‌లో భార్యను ప్రియుడితో కలిసి ఉండగా కనుగొన్నాడు. ఈ ఘటనతో హోటల్‌లో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాలను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.