TG: వర్క్ ఫ్రం హోమ్ అంటూ సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో చిక్కి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరం KPHB తులసీనగర్ లో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనూష కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటున్నారు. టెలిగ్రామ్ యాప్‌లో వర్క్ ఫ్రం హోం అని ప్రకటన చూసి బంగారం అమ్మిపెట్టుబడి పెట్టింది. సుమారు రూ.లక్ష దాకా పోగొట్టుకున్నారు. ఆర్థికంగా మోసపోయానని భావించి మనస్థాపంతో ఉరేసుకుని చనిపోయింది.