TG: హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాప్రాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న గోపాలకృష్ణ, స్వాతి మహాజన్(35) దంపతుల్లో, ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన స్వాతి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గతంలో యూకేలో నివసించిన ఈ దంపతులు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. గోపాలకృష్ణ ఉద్యోగం చేస్తుండగా, స్వాతి ఉద్యోగ అన్వేషణలో ఉంది. భర్త సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.