వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సంతు అనే వెండి పని చేసే వ్యక్తి ఇంట్లో, వృత్తిపరమైన అవసరాల కోసం నిల్వ చేసిన యాసిడ్‌ను నీటి కంటైనర్‌లో పొరపాటున ఉంచడంతో, అతని భార్య ఆ యాసిడ్‌తో ఆహారం వండింది. ఈ ఆహారం తిన్న కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.