యూపీలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడిన భార్య, తన భర్త దేవేంద్రరామ్‌ను దారుణంగా హత్య చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవేంద్ర రామ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. విధుల నిమిత్తం ఇంటికి దూరంగా ఉండటంతో అనిల్ అనే వ్యక్తితో భార్యకు ఎఫైర్ ఏర్పడింది. వారి బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఇద్దరు కలిసి భర్తను దారుణంగా నరికి, ఆరు ముక్కలుగా చేసి చుట్టుపక్కల ప్రదేశాల్లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.