రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్.. యువతి మృతి (వీడియో)

రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో ఓ మహిళ గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బ్యాంక్ ఉద్యోగి అయిన యోగేశ్వరి (27) అనే యువతి లంచ్ కోసం తన స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యోగేశ్వరి ముందుకు రాగా వేగంగా వచ్చిన బైకు ఢీకొట్టడంతో ఆమె కొంత దూరంలో ఎగిరిపడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. రైడర్ దీపన్ (22)కు గాయాలయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్