చెన్నైలోని వేపేరి ప్రాంతంలో తాజాగా ఓ మహిళ విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయింది. శ్రీదేవి (42) అనే మహిళ తన పిల్లలను స్కూల్‌లో దింపి, స్కూటర్‌పై తిరుగు పయనమైంది. మార్గమధ్యంలో ఓ మినీకార్గో వ్యాన్ ఆమె స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన ఆమెపై నుంచి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే శ్రీదేవి చనిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
Video Credits: Sun News