ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

AP: విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంగం నాయుడు, తన భార్య శ్రీలతతో కలిసి బైక్‌పై చీపురుపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బొండపల్లి మీదుగా మెరకముడిదాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. చిన్నఐతంవలస దగ్గర వీరిద్దరూ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. శ్రీలత అక్కడికక్కడే మృతి చెందగా.. సంగంనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. తన కళ్లెదుటే భార్య మృతి చెందడంతో సంగం నాయుడు గుండెలు పగిలేలా రోదించారు.

సంబంధిత పోస్ట్