తమిళనాడులోని తెన్కాసి జిల్లా కడయంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధ మహిళ ప్రభుత్వ బస్సు ఎక్కుతుండగా, ఆమె పూర్తిగా లోపలికి వెళ్లకముందే డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో పట్టుతప్పి కిందపడిన ఆమె బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించింది. ఈ దృశ్యాలు సిసిటివిలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.