డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మహిళ మృతి(వీడియో)

వయసుతో సంబంధం లేకుండా మనుషులు అకస్మాత్తుగా చనిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా పంజాబ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బర్నాలాకు చెందిన ఆశా రాణి(59) అనే మహిళ కర్వా చౌత్ పండగ సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్