AP: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గాలివాన తీవ్రతకు ఒక తాటిచెట్టు విరిగి గూడపల్లి వీరవేణి అనే మహిళపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.