లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి

TG: లిఫ్ట్‌లో ఇరుక్కుని ఒక మహిళ మృతి చెందిన ఘటన HYDలోని చందానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం నల్లగండ్లకు చెందిన ధాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ (43)తో కలిసి చందానగర్‌ చాట్వాజ్‌ మెన్షన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ లిఫ్ట్ ఎక్కుతున్న సమయంలో అది అకస్మాత్తుగా పైకి కదలడంతో అనసూయ లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్