ఇంటిపై విరిగిపడిన తాటి చెట్టు.. మహిళ మృతి (వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలుల కారణంగా రాఘవేంద్ర నగర్ కాలనీలోని ఓ రేకుల ఇంటిపై తాటి చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో సభావత్ లక్ష్మి అనే దివ్యాంగ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న ఆమె కుమారుడు, కోడలు కూడా దివ్యాంగులేనని సమాచారం. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్