బెంగళూరులో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ‘మూడు రోజుల క్రితం స్నేహితుని ఇంట్లో ఉన్నాను. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి అత్యాచారం చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్‌కు బదిలీ చేశారు. అప్పు తీర్చాలని నా రెండు ఫోన్లు లాక్కున్నారు. ఇంట్లోని ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ తీసుకెళ్లారు’ అని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.