కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం

హర్యానాలోని ఫరీదాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున 25 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు కదులుతున్న కారులో దాదాపు రెండున్నర గంటల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్