జార్ఖండ్‌లోని టాటానగర్ నుండి యశ్వంత్‌పూర్ వెళ్తున్న రైల్లో మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన మహిళ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మధిర స్టేషన్ సమీపంలో పురిటినొప్పులు రావడంతో లోకో పైలెట్ ట్రైన్‌ను ఆపాడు. స్టేషన్ మాస్టర్ సుధీర్ బాబు, పాంచ్‌మెన్ కృష్ణయ్య సహకారంతో రైలు సిబ్బంది సకాలంలో స్పందించి ప్రసవం చేయించి ప్రాణాలను కాపాడారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండగా, వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.