ఇథియోపియాలోని హరారీ రాష్ట్రంలో 12 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళ సహజంగానే గర్భం దాల్చి, ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో నలుగురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరి బరువు 1.3-1.4 కేజీల మధ్య ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోనూ ఓ మహిళ ఒకేసారి నలుగురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.