ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ(వీడియో)

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో రాజేశ్వర్‌రావుపేటకు చెందిన రాజలక్ష్మి అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. రాజలక్ష్మి-నరేందర్ దంపతులకు వీరు తొలి సంతానం కావడం విశేషం. ఈ చిన్నారుల్లో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్