బురఖాలో వచ్చి పిస్టల్‌తో బెదిరించి జ్యువెలరీ షాపులో దోపిడీ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా రుదౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే ఓ జ్యువెలరీ షాపులో బురఖా ధరించిన మహిళ పిస్టల్‌తో బెదిరించి బంగారు నగలను దోచుకుంది. షాపు యజమానిని పిస్టల్‌తో బెదిరించి, ట్రేలో ఉన్న నగలను తీసుకుని ఆమె క్షణాల్లో పరారైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. దోపిడీకి వాడిన పిస్టల్ నకిలీదని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితురాలిని పట్టుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్