మూడేళ్ల కొడుకుతో కలిసి కెనాల్‌లో దూకిన మహిళ(వీడియో)

TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల కొడుకుతో కలిసి ఓ మహిళ SRSP కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. కామిండ్ల కళ్యాణి(30) తన కుమారుడు శ్రేయాన్ష్‌తో కలిసి కట్ర్యాల శివారులోని కాలువలో దూకడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. కాగా, నాలుగేళ్ల క్రితం స్టేషన్ ఘన్పూర్‌కు చెందిన హరీష్‌తో కళ్యాణికి వివాహం జరిగింది. కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ఆ పక్కనే వారి చెప్పులను గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్