ప్రియుడితో కలిసి భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన మహిళ

కర్ణాటకలోని బెంగళూరులో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త, కొడుకులను భార్య దారుణంగా హత్య చేసింది. వినయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న హరిణి, తన భర్త అభినందన్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ క్రమంలో నిద్రలేచిన నాలుగేళ్ల కుమారుడు యదువీర్‌ను కూడా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం రక్తపు మరకలను శుభ్రం చేసి, దుస్తులను ఉతికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హరిణిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హరిణి, ప్రియుడు వినయ్‌లపై హత్య కేసు నమోదు చేసి, వినయ్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్