భర్తను హత్య చేసి.. ఇంటి ఆవరణలోనే పూడ్చేసిన మహిళ

అస్సాం గువాహటిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ భర్తను చంపి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టింది. గువాహటికి చెందిన రహీమా, సబియాల్ రెహ్మాన్ (38)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండుండేవి. దీంతో రహీమా భర్తను చంపి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టి ఏం తెలియనట్టు అదే ఇంట్లో ఉంటుందని తెలిపారు. అతడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్