బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో దారుణ హత్య జరిగింది. భార్య నీలం దేవి తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లౌరియా బ్లాక్ ప్రాంతానికి చెందిన ఈ ఘటనలో, నీలం దేవి పోలీసుల విచారణలో నేరం అంగీకరించింది. భర్త ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె తెలిపింది. తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.