AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పేరుతో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విద్య అనే మహిళ రూ.18 కోట్ల మోసానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చెవిరెడ్డి పీఏ ద్వారా రూ.2 వేల కోట్లు వస్తున్నాయని నమ్మబలికి, కొందరి వద్ద కంటైనర్లు కొనుగోలు పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మరికొందరికి బంగారం ఇస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు గుంజి మోసం చేసినట్లు బాధితులు వాపోయారు.ఈ ఘటనపై చెవిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.