ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మహ్మద్ నవీద్ అలియాస్ ఖాసిం పఠాన్ అనే వ్యక్తి తనను శివ్ వర్మగా పరిచయం చేసుకొని మోసగించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువుగా నటిస్తూ తనతో సన్నిహితంగా మెలిగి, శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె పేర్కొంది. అనంతరం మతం మారాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.