కంటి పరీక్ష పేరుతో మహిళపై అత్యాచారం

దిల్లీలో కంటి పరీక్ష పేరుతో ఓ మహిళకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. త్రినగర్‌కు చెందిన వికాస్‌ (32) కంటి పరీక్ష సాకుతో 43 ఏళ్ల మహిళను తన ఇంటికి పిలిపించాడు. ఆమెకు మత్తుమందు కలిపిన పదార్థాన్ని ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి, అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕