ఆటోలో మహిళ మృతదేహం కలకలం

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. శనివారం తిలక్‌నగర్‌లోని ప్రధాన రహదారిపై నిలిచి ఉన్న ఆటోలో మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతురాలు 35 ఏళ్ల సల్మా అనే మహిళగా గుర్తించారు. ఆమెను తెలిసిన వ్యక్తి ఎవరో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి రోడ్డు పక్కన పార్క్‌ చేసిన ఆటోలో వదిలేశారని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్