కారులోనే మహిళకు లైంగిక వేధింపులు.. చివరికి

న‌డుస్తున్న కారులోనే 24 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. తన కోరిక తీర్చాలని బలవంతంగా లోబర్చుకోబోయాడు. వేధింపుల‌కు పాల్ప‌డిన ఆ వ్య‌క్తి వీడియోను త‌న మొబైల్ ఫోన్‌తో షూట్ చేసింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే అక్కడిని నుంచి బయటపడిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే అని, మోమో తిందామ‌ని త‌న‌ని కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె వద్ద వీడియోని పోలీసులకు ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్