దుస్తులు చింపుకొని.. టీటీఈపై యువతి ఆరోపణలు

రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతి తన వద్ద టికెట్ లేకపోవడంతో పెద్ద డ్రామాకు తెరలేపింది. తనిఖీకి వచ్చి టీటీఈ టికెట్ చూపించాలని ఆమెను అడగగా ఆ యువతి వాగ్వాదానికి దిగింది. అనంతరం తన దుస్తులను తానే చించేసుకుని, టీటీఈ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. టీటీఈ తన ఫోన్‌లో ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, అధికారులు సదరు యువతిపై చర్యలు తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕