మహిళను ఇంటి పైకప్పు నుంచి తోసేసిన వ్యక్తి (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని మైహర్ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. అక్కడ జరియారీ గ్రామంలో  భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళను భవనం పైకప్పు పైనుంచి కిందకు తోసేశాడు. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్