బ్రతికి ఉన్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ (వీడియో)

నేపాల్‌లోని బజాంగ్ జిల్లాలో, పంకోట్ వంతెనపై నుంచి ఓ మహిళ బతికున్న కుక్కను సేతి నదిలోకి విసిరేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆ కుక్క ఎవరినో కరిచిందనే కారణంతో ఆమె ఈ అమానవీయ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. స్థానిక పోలీసులు కుక్క ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, ఈ దారుణానికి పాల్పడిన మహిళను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕