సంతానం లేదని.. యజమాని బిడ్డను కిడ్నాప్‌ చేసిన మహిళ

TG: హైదరాబాద్‌లోని మేడిపల్లి ఎన్‌ఐఎన్‌ కాలనీలో శివరామ్ ఇంట్లో పనిచేస్తున్న దుర్గాభవానీ అనే పనిమనిషి.. యజమాని కొడుకు వైష్ణవ్‌ రుద్రాన్ష్‌ను కిడ్నాప్ చేసింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆడిస్తానని తీసుకెళ్లి ఆటోలో ఎత్తుకెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీల ఆధారంగా మూడు గంటల్లోనే కర్మన్‌ఘాట్‌లో దుర్గాభవానీని అదుపులోకి తీసుకుని, శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సంతానం లేని దుర్గాభవానీ, బాబును పెంచుకునేందుకే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్